ఆ మొక్కలు డేంజర్: పవన్
NEWS Aug 30,2024 05:12 am
అరబ్ దేశాల్లో పచ్చదనం కోసం కోనోకార్పస్ జాతి మొక్కలను విరివిగా పెంచారన్నారని, అయితే తర్వాత వాటి దుష్ప్రభావం అర్థం చేసుకొని ఆ దేశాలే ఈ మొక్కను వద్దనుకొని నిషేధించాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. పలు రాష్ట్రాలు కోనోకార్పస్‌ను నిషేధించాయన్నారు. కోనోకార్పస్ వల్ల జరిగే అనర్థాలు అధికంగా ఉన్నాయని, భూగర్భ జలసంపదను ఎక్కువగా వినియోగించుకోవడంతోపాటు చుట్టుపక్కల ఉన్నవారికి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయన్నారు. కోనోకార్పస్ మొక్కను పశువులు తినవని.. పక్షులు గూడుపెట్టుకోవన్నారు. ఈ మొక్కను నాటడం మానేయాలని సూచించారు.