కేంద్రం నుంచి APకి నిధుల వరద
NEWS Aug 30,2024 05:04 am
APకి కేంద్రం నుంచి నిధుల వరద పారుతోంది. కేంద్రం సహకారంతో కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. అమరావతికి 15 వేల కోట్లు, పోలవరానికి 12 వేల కోట్లు, విశాఖ, విజయవాడ మెట్రోలకు 40వేల కోట్లు నిధులు వచ్చేందుకు గ్రౌండ్ వర్క్ పూర్తయ్యింది. ఇవికాక.. మౌలిక సదుపాయాల కల్పన, ఇండస్ట్రియల్ కారిడార్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనకు 2400 కోట్లు కేంద్రం కేటాయించగా.. ఇప్పటికే 1500 కోట్లు రిలీజ్ చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులు 1450 కోట్లు రావడంతో.. వాటిని అన్ని గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.