కొమ్మంగి, కొండ వంచుల బస్సులను పునరుద్ధరించాలి
NEWS Aug 30,2024 05:03 am
ASR: కొమ్మంగి, కొండ వంచుల బస్సులను పునరుద్ధరించాలని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఆర్టీసీ అధికారులను కోరారు. గతంలో ఆర్టీసీ బస్సు సర్వీస్ నడిపేవారని తెలిపారు. ప్రస్తుతం ఆయా ఆర్టీసీ బస్సు సర్వీస్లు పూర్తిగా నిలిపివేయడంతో ఆయా రూట్లలో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆర్టీసీ అధికారులు కొమ్మంగి, కొండ వంచుల బస్సులను తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కోరారు.