పాడేరు-జీ.మాడుగుల రోడ్డులో పెరిగిన తుప్పలు
NEWS Aug 30,2024 05:02 am
పాడేరు నుంచి జీ.మాడుగుల మీదుగా వెళ్లే రహదారికి ఇరువైపులా తుప్పలు పెరిగిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పి.గొందూరు మొదలుకుని కరకపుట్టు, డీ.గొందూరు మధ్యలో తుప్పలు పెరిగాయని ఆవేదన చెందుతున్నారు. మలుపులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తుప్పలతో రహదారి సిగ్నల్ సూచికలు మూసుకుపోయాయి. వెంటనే ఆర్అండ్బి అధికారులు తుప్పలు తొలగించాలని వాహన చోదకులు కోరుతున్నారు.