నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామం వద్ద గల రెంకొని వాగు తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతి పెరిగి తాత్కాలిక వంతెన శుక్రవారం ఉదయం కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు.