అనంతగిరి మండలంలోని రాజుపాక గ్రామానికి చెందిన గిరిజనులకు చెందిన 4 మేక్కలపై చిరుత పులి దాడి చేసింది. గురువారం మేత కోసం గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి పశువుల కాపరులు తీసుకువెళ్లారు. గమనించిన చిరుత పులి మేక్కల మందపై దాడి చేసిందని గిరిజన రైతులు తెలిపారు. ఫారెస్ట్ శాఖ అధికారులు చిరుత పులిని బందించి తమ మేకలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.