ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎక్కువ అవ్వడంతో ప్రాజెక్టు యొక్క మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయినిటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 699.350 అడుగుల వద్ద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా 25403 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్న క్రమంలో 21053 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కడెం ప్రాజెక్టు అధికారులు.