వనమహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే
NEWS Aug 30,2024 05:00 am
“వనం మనం” కార్యక్రమములో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ శుక్రవారం ఉదయం 10 గంటలకు మున్సిపాలిటి పరిధిలో గల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రక్కన ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు మొక్కలు నాటే కార్యక్రమములో పాల్గొనున్నారు. ఎంపీటీసీ సభ్యులకు, సర్పంచులకు, ప్రజా ప్రతినిధులకు,మండల స్థాయి అధికారులకు, కార్యకర్తలకు ఆహ్వానం పంపడం జరిగిందని ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.