ఇబ్రహీంపట్నానికి చెందిన స్నాప్లిక ఫొటోగ్రఫీ అధినేత సోనుకు ప్రతిష్టాత్మక టైమ్స్ బిజినెస్ అవార్డు లభించింది.ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా 6 సంవత్సరాలుగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ రంగాల సంస్థలకు ప్రతి సంవత్సరం అవార్డులు అందజేస్తుంది.2024 సంవత్సరానికి ఫొటోగ్రఫీ బిజినెస్ విభాగంలో స్నాప్లిక ఫొటోగ్రఫీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. విజయవాడ నోవా టెల్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా సోను అవార్డును అందుకున్నారు.