వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం
NEWS Aug 29,2024 06:00 pm
ఢిల్లీ: వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం తెలిపారు. దీంతో రాజ్యసభలో 2 స్థానాలు ఖాళీలు అయ్యాయి. ఈ స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది. అయితే ఈ 2 రాజ్యసభ స్థానాలను ఎన్డీయే కూటమినే దక్కించుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.