KMR: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట తహసీల్దార్ లక్ష్మణ్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ 15 రోజులుగా రైతులు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందిస్తూ ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నే ప్రభాకర్ విచారణ జరిపారు. అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో లక్ష్మణ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఆర్డీఓ తెలిపారు.