HYD: ‘ఏందీ చెత్తా చెదారం? నీటి నిల్వలు ఉంటే దోమలు వృద్ధి చెందవా? ఇంత అధ్వానంగా ఉంటే వ్యాధులు ఎందుకు రావు? మీరంతా ఏం చేస్తున్నా రు? క్షేత్రస్థాయిలో పర్యటించరా?’ అని హైదరాబా ద్ కలెక్టర్ అనుదీప్ GHMC ముషీరాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఖాదర్‌పై అసహనం వ్యక్తం చేశారు. చెత్తా చెదారం, మట్టి కుప్పలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. డెంగీ, సీజనల్ వ్యాధుల వ్యాప్తి నేపథ్యంలో కలెక్టర్ రాంనగర్‌లోని ఎస్సార్టీ క్వార్టర్స్, కృష్ణానగర్‌లో పర్యటించారు.