వైన్స్ లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గజదొంగల ముఠాని అరెస్టు చేసినట్లు నిర్మల్ డిఎస్పి గంగారెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక వైయస్సార్ కాలనీకి చెందిన రఘు, పాండురంగ, శ్రీను, దిలీప్ లు మద్యానికి బానిసై రాత్రుల్లో దొంగతనం చేసేవారని తెలిపారు. దొంగతనం జరిగిన 24 గంటల్లోనే సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో దొంగలను పట్టుకోవడం జరిగిందని తెలిపారు.నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.