యుడైస్ ప్లస్లో వివరాలు పక్కాగా నమోదు చేయాలి
NEWS Aug 29,2024 04:41 pm
యుడైస్ ప్లస్లో పాఠశాల వివరాలను, సౌకర్యాలను తదితర వివరాలను ఎంఈఓలు, హెచ్ఎంలు పక్కాగా నమోదు చేయాలని డీఈఓ రవీందర్ రెడ్డి సూచించారు. నిర్మల్ పట్టణంలోని సెయింట్ థామస్ పాఠశాలలో జిల్లాలోని ఆయా పాఠశాలల హెచ్ఎంలు, విద్యాశాఖ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయా పాఠశాలలకు సంబంధించిన వివరాలను సెప్టెంబర్ 15లోపు నమోదు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంఈవోలు ,హెచ్ఎం లు పాల్గొన్నారు.