ఉత్సవాలను శాంతియుతంగా చేసుకోవాలి
NEWS Aug 29,2024 04:41 pm
వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బైంసా ఏఎస్పీ అవినాష్, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, పట్టణంలోని ఆయా మండపాల నిర్వాహకులు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.పండుగను ప్రజలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జరుపుకోవాలని కోరారు.