ఆదిలాబాద్ రిమ్స్ లో ఆల్ ఇండియా MBBS కోటా ప్రవేశాల గడువును పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 29తో ముగుస్తున్న గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఆల్ ఇండియా కోటాలో రిమ్స్ కు 15 సీట్లు కేటాయించారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. గడువు పొడిగించి విద్యార్థులకు మరో అవకాశం కల్పించారు.