నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అజార్ ఖాన్ సామాజిక కార్యక్రమాలు చేస్తూ గుర్తింపు పొందాడు. నిర్మల్ పట్టణంలో ఓ యాక్సిడెంట్ కావడంతో ఓ వ్యక్తి స్పృహ తప్పి పోవడంతో సీపీఆర్ చేసి ఆ మనిషి ప్రాణాలను కాపాడాడు. దీంతో ఆయనపై స్థానికులతో పాటు పలువురు ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని ఆకాక్షించారు.