హిందూపురంలో బిజెపి సభ్యత్వ నమోదు సన్నాహక
సమావేశం
NEWS Aug 29,2024 04:45 pm
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని రోటరీ క్లబ్లో బీజేపీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ హాజరై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బలమైన భారతదేశం కోసం
బీజేపీని బలపరచాలని ప్రతి పోలింగ్ బూత్లో 300
మంది సాధారణ సభ్యులను నమోదు చేయాలని
సూచించారు. కార్య క్రమంలో బీజేపీ నాయకులు,
కార్యకర్తలు పాల్గొన్నారు.