కొత్తపేటలో బీజేపీ మండల సమావేశం
NEWS Aug 29,2024 04:39 pm
కొత్తపేట మండలంలో బీజేపీ సభ్యత్వం నమోదు కొరకు బీజేపీ నేత సంపతి కనకేశ్వరవు నివాసంలో మండల అధ్యక్షులు మాధవ స్వామి అధ్యక్షతన మండల నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోక వెంకట సుబ్బారావు, రాష్ట్ర నేత పాలూరి సత్యానందం పాల్గొని దేశ వ్యాప్తంగా వచ్చే నెల సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ నమోదు బూత్ స్థాయి నుండి ఏ విధంగా చేపట్టాలో వివరించారు.