వైసీపీలో రాజీనామాల పర్వం
NEWS Aug 29,2024 01:16 pm
వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తానరావు.. వీరిద్దరూ రాజ్యసభ సభ్యత్వంతో పాటు వైసీపీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. సెప్టెంబరు 5 లేదా 6న వీరిద్దరూ టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం సాగుతోంది. వీరి బాటలోనే పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబూరావు, అయోధ్యరామిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, మేడా రఘునాథ రెడ్డి వంటి నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం సాగుతోంది.