తిరుమల: శ్రీవారి లడ్డూలపై TTD కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ జారీ విధానంలో మార్పులను తీసుకొచ్చింది. ఇకపై ఆధార్ కార్డు చూపిస్తేనే లడ్డూలు జారీ చేస్తారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్‌పై ఒక్క లడ్డూను మాత్రమే ఇవ్వనున్నారు. అంతకు ముందు దర్శన టోకెన్‌పై ఒక భక్తునికి 2 లడ్డూలు ఇచ్చేవారు. ప్రస్తుతం మాత్రం ఒక్క లడ్డూనే ఇవ్వనున్నారు. అదనపు లడ్డూలు కావాలంటే ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది.