అమలాపురం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో మాతృభాష దినోత్సవ వేడుకలు గురువారం విద్యార్థులు అధ్యాపకులు నడుమ ఘనంగా జరిగాయి. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి కవితలు పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాష ప్రాచీనీయులు దివంగత గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటం లోనికి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కవితా పోటీలలో విద్యార్థులకు బహుమతులను అందజేశారు.