21 ఏళ్లకే 3600 కోట్ల సంపద!
NEWS Aug 29,2024 12:06 pm
హూరన్ రిచ్ లిస్ట్ 2024 దేశంలో అత్యంత ధనవంతుల లిస్టులో అదానీ, అంబానీ టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఈ లిస్టులో 21 ఏళ్ల ఈ కుర్రాడు కౌవల్య వోహ్రా.. సంపద రూ. 3600 కోట్లు. హూరన్ రిపోర్టులో అత్యంత చిన్న వయసు కలిగిన ధనవంతుడిగా నిలిచారు. క్విక్ కామర్స్ యాప్ ‘జెప్టో’ కో-ఫౌండర్ కైవల్య వోహ్రా. ఇతడితో పాటు మరో కో-ఫౌండర్ 22 ఏళ్ల ఆదిత్ పాలిచా లిస్టులో రెండో చిన్న వయస్కుడిగా ఉన్నారు. వీరు కోవిడ్ టైం 2021లో జెప్టోని ప్రారంభించారు.