ముంబైలో సినీనటి కాదంబరీ జెట్వాని వేధింపుల వ్యవహారంపై ఏపీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు. జెట్వానితో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ నుంచి విజయవాడ సీపీ ఆదేశాలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటికే విజయవాడ పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. విచారణ కోసం పోలీస్ బృందం ముంబై వెళ్లే అవకాశాలున్నాయి.