రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసంపై హైడ్రా నోటీసులు పెట్టింది. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలోని తిరుపతిరెడ్డి ఇల్లు, కార్యాలయం దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వారికి నోటీసులు జారీ చేశారు. FTL కింద నిర్మించిన అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించాలని రెవెన్యూ అధికారులు సూచించారు. తన భవనం FTLలో ఉందని ప్రభుత్వం నిర్ధారిస్తే ఎలాంటి చర్యలైనా తీసుకొవచ్చని తిరుపతి స్పష్టం చేశారు. తనకు అభ్యంతరం లేదన్నారు. ఆ భూమి కోటేశ్వరరావు పేరు మీద రిజిస్టర్ ఉందన్నారు.