కవితను చూడగానే కేసీఆర్ భావోద్వేగం
NEWS Aug 29,2024 09:01 am
ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. భర్త, కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ ఆహ్వానం లభించింది. కన్నబిడ్డను చూడగానే తండ్రి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. అక్రమ నిర్భంధం నుంచి బయటకొచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ కళ్ళలో ఆనందం కనిపించింది. తండ్రి పాదాలకు నమస్కరించారు కవిత. బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు కేసీఆర్.