మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి MLA
NEWS Aug 29,2024 10:02 am
పొందూరు మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆమదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ హాజరయ్యారు. మండలానికి సంబంధించినటువంటి చాలా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళిన ఆయన వారి నుండి వివరణ కోరారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీమతి కూన ప్రమీల, ఇతర ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.