తెలుగు భాష దినోత్సవ వేడుకలు
NEWS Aug 29,2024 07:22 am
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం బొడ్లపాడు గ్రామ ప్రాధమిక పాఠశాల ఆవరణలో విద్యార్థుల, ఉపాధ్యాయులు సమక్షంలో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన జానీ పాల్గొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన మన అమ్మ భాషను ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాలని, నవ తరానికి తెలుగు గొప్పదనాన్ని తెలియజేయాలన్నారు. గ్రాంథికంలో ఉన్న తెలుగును వాడుక భాషకు జీవం పోసిన గిడుగు రామ్మూర్తిని స్మరించుకున్నారు.