జిల్లా యువతకు ఫొటోగ్రఫీ కాంటెస్ట్
NEWS Aug 29,2024 07:24 am
యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ఫొటోగ్రఫీ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్టు అల్లూరి జిల్లా SP అమిత్ బర్ధర్ తెలిపారు. జిల్లా ప్రకృతి సోయగాలు, గిరిజన సంప్రదాయాలు, జీవన స్ధితి, అభివృద్ది, సమస్యలు, జరుగుతున్న మంచి, చెడు కార్యక్రమాలపై ఫొటోలు తీసి జిల్లా పోలీసు వారి Instagram (@asrdistpolice.100) & X (@asrpolice100)లింకులలో షేర్ చేయాలన్నారు. వీటిలో ప్రతినెల మొదటి వారంలో బెస్ట్ ఫొటోను ఎంపిక చేస్తామని SP తెలీయజేశారు.