ఖానాపూర్ పట్టణంలోని శివాజీ నగర్కు చెందిన మునుగురి వెంకటేశ్ ప్రమాదవశాత్తు సదర్ మాట్ లెఫ్ట్ కెనాల్లో పడి మృతి చెందినట్లు ఖానాపూర్ ఎస్సై లింబాద్రి తెలిపారు. వెంకటేశ్ బుధవారం రాత్రి శివాజీ నగర్-అంబేడ్కర్ నగర్ మధ్య ఉన్న సదర్ మాట్ లెఫ్ట్ కెనాల్ బ్రిడ్జిపై కూర్చుని ఉండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారని వెల్లడించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.