నటిని వేధించిన ఘటనపై ప్రభుత్వం విచారణ జరపాలి
NEWS Aug 29,2024 10:03 am
గత వైసీపీ ప్రభుత్వంలో ఒక బాలీవుడ్ నటిని ఏపీ పోలీసులు, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ వంటి వారు వేధించిన ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపించాలని ఏపీ పౌరహక్కుల రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు డిమాండ్ చేశారు. మహిళల హక్కులను విధ్వంసం చేసిన అప్పటి పోలీస్ అధికారులు అయిన సీతారామాంజనేయులు, కాంతి రానా టాటా, విశాల్ గున్నితో పాటు విద్యాసాగర్‌ను శిక్షించాలన్నారు.