తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి జైలు
NEWS Aug 29,2024 10:33 am
పెద్దాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులో ముగ్గురికి రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి బుధవారం తెలిపారు. మొత్తం 43 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు వంతున జరిమానా విధించారని చెప్పారు. ప్రత్తిపాడు, తుని, పెద్దాపురం న్యాయమూర్తులు ఈ శిక్షలు విధించారన్నారు. 32 మందిని ఒక రోజు సామాజిక కార్యక్రమాలు చేయాలని ఆదేశించారని వివరించారు.