కాకినాడలో 18 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
NEWS Aug 29,2024 10:33 am
కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కాకినాడ టౌన్ పరిధిలో బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. 18 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వారిని మెజిస్ట్రేట్ నరసింహారావు ఎదుట హాజరు పరచగా ఒకరికి ఒక రోజు, ముగ్గురికి రెండు రోజులు, మరో ముగ్గురి వ్యక్తులకు నాలుగు రోజులు వంతున జైలు శిక్ష విధించారన్నారు. మరో 11 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించారన్నారు.