ఈ నెల 30న పారా మెడికల్ కౌన్సిలింగ్
NEWS Aug 30,2024 05:01 am
కాకినాడ: 2024-25 విద్యా సంవత్సరంలో పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 30న కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం బుధవారం తెలిపారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థులు కౌన్సిలింగ్‌కు అర్హులన్నారు. శుక్రవారం ఉదయం 9.గంటల నుంచి కళాశాలలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఇతర వివరాలకు కార్యాలయం వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు.