ఉమ్మడి తూ.గో జిల్లాలో ఇసుక కొరత వేధిస్తోంది. స్టాక్ పాయింట్లలో నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. గోదావరి వరదలతో నదుల్లో ఇసుకను తీసే పరిస్థితి ప్రస్తుతానికి లేదని అధికారులు తెలిపారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇసుక కోరతతో నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడ పూర్తిగా నిలిచిపోయాయి. మరో రెండు వారాలు వరకు పరిస్థితి ఇలానే ఉంటుందన్నారు. వచ్చేనెల 10 నుంచి ఇసుక అందుబాటులోకి వస్తుందంటూ అధికారులు చెబుతున్నారు.