సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం ముస్లిం పాఠశాల మదర్సాలో 4వ తరగతి విద్యార్థి రిహాన్ (14) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని ఎస్సై దుర్గాశ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు.. జార్ఖండ్ కు చెందిన రిహాన్ కొన్నేళ్ల నుంచి మదర్సాలో చదువుకుంటున్నాడు. మంచినీళ్లు తాగుతూ పడిపోయి చనిపోయాడని బంధువులకు సమాచారం అందించారు. రెహాన్ బావ మెర్సన్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు.