కాకినాడ మునసబు కూడలి విష్ణాలయం సమీపంలో అమలాపురం వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీ కొని బుధవారం రాత్రి ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి చెందిన నూకరత్నం (35) అక్కడికక్కడే మృతి చెందింది. కరప మండలం పెనుగుదురులో బంధువుల పెళ్లికి భర్త నానిబాబుతో కలిసి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. దీంతో బస్సు వెనుక చక్రం కింద పడి ఆమె మృతి చెందింది. ఘటనపై కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.