సఖినేటిపల్లి- నరసాపురం రేవు పాట 2.98కోట్లు
NEWS Aug 29,2024 12:35 pm
సఖినేటిపల్లి- నరసాపురం రేవు పాట రూ.2.98 కోట్లు వచ్చిందని సఖినేటిపల్లి ఎంపీడీవో సత్యనారాయణ వెల్లడించారు. మాధవాయపాలెం ఫెర్రీగా పిలిచే ఈ రేవు పాటను నరసాపురం ఎంపీడీవో కార్యాలయంలో టెండర్లు, వేలం నిర్వహించగా.. పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంకకు చెందిన శ్రీకనక దుర్గా శాండ్ అండ్ కో-ఆపరేటివ్ సొసైటీ రూ.2.98 కోట్లకు పాడుకున్నట్లు చెప్పారు. ఎంపీపీ మల్లిబాబు, ఎంపీడీవో సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.