బంగాళాఖాతంలో అల్పపీడనం
NEWS Aug 29,2024 10:33 am
ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషా ని ఆనుకొని అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రము అల్లకల్లోలంగా ఉంటుందని,ఈనెల 30,31తేదీలలో శ్రీకాకుళం వ్యాప్తంగా తీవ్రమైన వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీనికి సంబంధించిన ఛాయాచిత్రాలు విడుదల చేసింది.