వారికి లేని సమస్య మీకెందుకు?: హైకోర్టు
NEWS Aug 28,2024 06:22 pm
వేణుస్వామికి నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వేణుస్వామిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులివ్వగా, దానిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. నాగచైతన్య శోభితాలకు లేని ఇబ్బంది మీకెందుకు అని సినీ జర్నలిస్టులను ప్రశ్నించింది. మహిళా కమిషన్ నోటీసులు చెల్లవని కోర్టు పేర్కొంది.