కవితకు బెయిల్‌పై రేవంత్ స్పందన
NEWS Aug 28,2024 04:02 pm
కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రాజకీయ కోణంలో స్పందించారు. ఆప్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టిందని, కవితకు 5 నెలల్లోనే బెయిల్ వచ్చిందని అన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పటికీ బెయిల్ రాలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు షేరింగ్ చేసినందుకు ప్రతిఫలంగానే కవితకు బెయిల్ వచ్చిందన్నారు. BRS-BJP మధ్య ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందన్నారు.