'రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తోంది'
NEWS Jan 28,2026 06:45 pm
భీమవరం: వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తోందని, హామీలన్నీ మోసపూరితమని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువతకు ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. అవినీతి, మద్యం మాఫియా, ఇసుక అక్రమాలు, మహిళలపై దాడులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. మరో ఏడాదిన్నరలో పాదయాత్ర చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని ప్రకటించారు.