తాళ్లరేవు మండలంలో బిజెపి పార్టీ సభ్యత్వాల నమోదుకై మండల అధ్యక్షులు కొప్పనాతి దత్తాత్రేయ వర్మ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు యాళ్ళ దొరబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ పార్టీ సభ్యత్వాలపై దృష్టి పెట్టి మన జిల్లాలో అత్యధికంగా సభ్యత్వాలు నమోదు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.