కొండాపురంలో పరిషత్ షష్ట్యబ్ది ఉత్సవాలు
NEWS Aug 28,2024 04:03 pm
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యంజిల్లా పాలకొండ మండలం, కొండాపురం గ్రామంలో పరిషత్ షష్ట్యబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. పరిషత్ స్థాపించబడి 60 సంవత్సరములు పూర్తియైన కారణంగా ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. ఆధ్యాత్మిక వేత్తలు జడ్డు జగ్గారావు గురూజీ, భాస్కరనాయుడులు సత్సంగాన్ని నిర్వహించారు. విశ్వమంతటా శాంతి, సౌభాగ్యాలు వికసింపజేసే సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించుకోవడమే లక్ష్యంగా, పూజ్య సాధుసంతుల, ధర్మ పురుషుల, త్యాగధనుల ఆశయాలకు హిందూ బంధువులను సమైక్య పర్చుకోవాలన్నారు.