అరకు: జాతీయ క్రీడా, తెలుగు భాషా దినోత్సవాలకు పోటీలు
NEWS Aug 28,2024 03:02 pm
జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం పురష్కరించుకొని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్ధులకు క్రీడా పోటీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. విద్యార్ధులకు వాలీబాల్, కబడ్డీ, రోల్ క్లిప్పింగ్, కేరమ్, షెటిల్ వంటి గేమ్స్ పిడి అప్పారావు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను తెలుగు అధ్యాపకులు సోంబాబు పర్యవేక్షించారు. ఈ పోటీలలో గెలిపొందిన వారికి ఆగష్టు 29 న బహుమతులు అందజేస్తామని ప్రిన్సిపాల్ డా కెబికె నాయక్ పేర్కొన్నారు.