పీఎం సూర్య ఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: శ్రీధర్ వర్మ
NEWS Aug 28,2024 03:01 pm
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజమహేంద్రవరం ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీధర్ వర్మ అన్నారు. అనపర్తి ప్రెస్‌క్లబ్‌లో ఈ పథకం గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహ వినియోగదారులు వినియోగ ఛార్జీలు తగ్గించుకునేందుకు పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. సబ్సిడీతో పాటు బ్యాంకు రుణాలు కూడా మంజూరు అవుతాయన్నారు.