30న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు.
NEWS Aug 28,2024 04:05 pm
మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 30న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ సహాయ కమీషనర్ లక్ష్మీనారాయణ తెలిపారు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని తెలిపారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొంటారని అన్నారు. రవిక, రూపు, లడ్డు తోపాటు వ్రతానికి కావలసిన పూజ సామగ్రి దేవస్థానం సమకూరుస్తుందన్నారు