పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
NEWS Aug 28,2024 03:03 pm
రాబోయే వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఖానాపూర్ సీఐ సైదారావు, దస్తురాబాద్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ సూచించారు. దస్తురాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ మాట్లాడుతూ రాబోయే వినాయక చవితి, దసరా పండుగలను ప్రజలు సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.