ఈవీఎం, వీవీప్యాట్ గోదాంనకు భద్రత చర్యలు
NEWS Aug 28,2024 06:37 pm
ఈవీఎం, వీవీప్యాట్ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల) లకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను ఆయన.. రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపక శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.