విద్యుత్ పోరాట అమరవీరులకు CITU నివాళులు
NEWS Aug 29,2024 12:36 pm
విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో పోలీసు తూటాలకు బలైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామికి సీఐటీయూ ఆధ్వర్యంలో ఘననివాళి అర్పించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషబాబ్జి మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యమం ఫలితంగా 15 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా విద్యుత్ ధరలు పెంచేందుకు సారించలేదనే తెలిపారు.